Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3614.


సూర్యునకే మేలుచేయు..మేధస్సది అందేమా..!

పరిశోధనలకు సంస్కృతి..బలిచేయుట ఆపేమా..! 


ఉదయారుణ గగనమెంత..కళదప్పెనో ప్రియసఖా.. 

ఎగిరిపోవు ప్రాణాలకు..రక్షణింత ఇచ్చేమా..! 


పశుపక్షుల ఆలనలో..పాలనలో సంబరమే.. 

సకలజీవ పరిరక్షణ..ఉత్సవాలు చేసేమా..! 


పుట్టుగుడ్డు పాపాయిని..విసిరేస్తూ తల్లులెలా.. 

మహిళా దినోత్సవాలకు..పరమార్థం చాటేమా..! 


"కరోనా"ను ఎదిరించగ..డ్రగ్గేదో కావాలా.. 

గుడ్లూ మాంసం చక్కగ..మానేయగ తలచేమా..! 


ఈ మాధవ గజల్ గుండె..విశ్వప్రేమ కంజీరా.. 

అక్షరాల చెలిమిపూల..వనములింక పెంచేమా..!

కళదప్పెనో ప్రియసఖా.
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.