Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3774.


ఆగి చూసి మున్ముందుకు..వెళ్ళుటయే ముఖ్యములే..! 

సరిగ మధ్య దూరమింత..ఉంచుటయే ముఖ్యములే..! 


సేవచేయు దేవుళ్ళకు..వచ్చెనెన్ని అగచాట్లు.. 

వారి ప్రాణదీపాలకు..మ్రొక్కుటయే ముఖ్యములే..! 


నిదానమే ప్రధానముగ..ఎఱుకతోటి కదలాలిక.. 

నిందార్హులు లేరన్నది..తెలియుటయే ముఖ్యములే..! 


సృష్టిలోన విహరించే..'వైరసు'లకు లోటులేదు.. 

ప్రతిఘటించు చైతన్యం..నిలుపుటయే ముఖ్యములే..! 


మేలుచేయు లక్షణాలు..కోకొల్లలు అణువణువున.. 

దివ్యప్రేమ శక్తిలాగ..మిగులుటయే ముఖ్యములే..! 


అంతరంగ జగతినేలు..మాధవుడే వివరించును.. 

తన పదముల వెలుగేదో..పట్టుటయే ముఖ్యములే..!

వెళ్ళుటయే ముఖ్యములే..!  కరోనా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.