Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3731. 


గబ్బిలాలు తినువారికి..బుద్ధులెవరు నేర్పగలరు..! 

పెనుప్రమాద ఘంటికలిక..ఇప్పుడెవరు నిలుపగలరు..!


ఏమి సైన్సు మందులేమి..ప్రయోగాల ఫలితమేమి.. 

పశుపక్షుల బలులన్నీ..అసలెవ్వరు వీడగలరు..! 


సహజమైన ప్రకృతితో..మమేకమై జీవించరె.. 

ఈ చదువుల తెలివిలోన..సత్యమెవరు అందగలరు..! 


రాకెట్లతొ దూసుకెళ్ళి..సాధించిన ఘనతలేమి.. 

జాబిలింటి రాళ్ళతోటి..రాజ్యమెవరు ఏలగలరు..! 


అనుకునేది ఒకటయితే..అయ్యేదే వేరొకటా.. 

ఎందుకిలా జరిగేనను..జ్ఞానమెవరు అందగలరు..! 


అహంకార సంద్రానికి..తీరమేది మాధవుడా.. 

నీ సన్నిధి హృదయమనే..చోటునెవరు నిలువగలరు..!

బుద్ధులెవరు నేర్పగలరు..!  కరోనా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.