Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3705.


గంజిలోకి మెతుకులేక..ఒరిగిపడే బతుకులెన్నొ..! 

శవరాజకీయమాడుతు..మిడిసిపడే బతుకులెన్నొ..! 


చీమకైన హానిని తలపెట్టని మనుషులేరి అసలు.. 

మానవతా సమాధిపై..ఎగిరిపడే బతుకులెన్నొ..! 


సత్యమెంత విచిత్రమో..బోధపడీ పడనిదేను.. 

తన సాక్షిగ ఉండలేక..మండిపడే బతుకులెన్నొ..! 


ఏది ప్రేమ ఏది చెలిమి..స్వార్థచింతనా వీధిన..

కలలతీర మందలేక..కాలిపడే బతుకులెన్నొ..! 


మొలకనవ్వు మాయమైన..ముచ్చటేల మిగిలేనో..

పూతలోనొ పిందెగానొ..రాలిపడే బతుకులెన్నొ..! 


మాధవునకు అన్ని తెలిసి..తెలియనట్లు ఉంటాడేం.. 

చైతన్యము తానేనని..తృప్తిపడే బతుకులెన్నొ

ఒరిగిపడే బతుకులెన్నొ..! 
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.