Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3688.


కణకణమున వెలుగుదీప..కోటినెవరు చూపగలరు..! 

పరమాద్భుత శ్రీ 'శార్వరి'..దీప్తినెవరు చూడగలరు..! 


మన భారత సంప్రదాయ..సంస్కారమె మహోజ్వలం.. 

ఈ సంస్కృతి కల్పతరువు..శక్తినెవరు తెలియగలరు..! 


రహస్యాలు వివరిస్తే..హేళనయే బహుమానం.. 

సహనముతో ఫలములంద..భక్తినెవరు నిలుపగలరు..! 


మంత్రతంత్ర విద్యలు సరె..సంకల్పం మాటేమిటి.. 

చిత్తశుద్ధి లేని మతికి..బుద్ధినెవరు పెంచగలరు..! 


అందరికీ వందనాలు..మేలన్నది తెలిసెనెపుడు.. 

ఆది పరాశక్తి కురియు..కాంతినెవరు అందగలరు..! 


మూలమైన 'శ్వాసమీద..ధ్యాస'నుంచుటెంత సులువు..

మాధవుడా పట్టుబట్టి..ముక్తినెవరు ఇవ్వగలరు..!

కోటినెవరు చూపగలరు..! 
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.