Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3686.


సామూహిక దీపశక్తి..చాటదగిన తరుణమిదే..! 

దివ్యమౌన వేదశక్తి..చూపదగిన తరుణమిదే..! 


దురహంకార చర్యలకు..గుణపాఠం తప్పదులే..

మనభారత జ్ఞానశక్తి..వెలుగదగిన తరుణమిదే..! 


సమరవాంఛలెల్ల కాల్చు..శాంతిమార్గ దర్శకులం.. 

పరమాద్భుత స్నేహశక్తి..పంచదగిన తరుణమిదే..! 


సంప్రదాయ మధురిమలను..కాచుకునే పనే మనది.. 

స్వచ్ఛమైన ప్రేమశక్తి..తెలుపదగిన తరుణమిదే..! 


ఆధిపత్య దుశ్చర్యలు..నిలువరింప చేద్దామిక..

ఆధ్యాత్మిక అమృతశక్తి..కదపదగిన తరుణమిదే..! 


అసలు సాధుతత్వమేదొ..ప్రకటించర మాధవుడా.. 

నిత్యసత్య కరుణశక్తి..కురియదగిన తరుణమిదే..!

తరుణమిదే..! 
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.