Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3653. 


మహా కఠిన పరీక్షా..సమయమని తెలిసేమా..! 

ఉన్న ఇంట ఉండుటయే..ఉపాయమని తెలిసేమా..! 


ప్రాణాలను మించి అసలు..ఆస్తులు అంతస్తులా..

బ్రతికియుండు సంగతిపుడు..అవసరమని తెలిసేమా..!


తేటతెల్ల మైనది కద..చేయిదాటి పోతున్నది.. 

మేలుకొల్పు ప్రభుత వాక్కు..ఔషధమని తెలిసేమా..! 


ప్రతి హృదయం కృతజ్ఞతా..వనమే కద గమనిస్తే.. 

పరిశుభ్రత పాటించుట..ప్రధానమని తెలిసేమా..! 


జరగవోయి అద్భుతాలు..సృష్టించే పనే మనది.. 

జీవులన్నీ వసుధైక..కుటుంబమని తెలిసేమా..! 


మనుషులనడుమన తప్పని..దూరమెంతో అవసరం.. 

మరి మాధవ గజల్ విశ్వారామమని తెలిసేమా..!

తెలిసేమా..! 
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.