Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ 3649.


తీరికేమొ లేకుండా..దక్కిందా ఇపుడైనా..!

ప్రశాంతతే ధనమన్నది..తెలిసిందా ఇపుడైనా..!


ఒక మాస్కున బ్రతకటమే..మేలేమో గమనిస్తే..

మనసులోని మాలిన్యం..కాలిందా ఇపుడైనా..!


వెర్రితిండితో తిప్పలు..ప్రపంచానికే ముప్పులు.. 

శత్రుభావ మెందుకసలు..వదిలిందా ఇపుడైనా..!


మంచిమాట ఏదైనా..చేదుపాఠమే నిజమే..

చేదుమాటు మాధుర్యం..అందిందా ఇపుడైనా..!


విశ్వహితం కోరేందుకు..కరుణలేక కుదరదులే..

విశ్వామిత్రు లెవరన్నది..తేలిందా ఇపుడైనా..!


జగమంతా అలజడిలో..మునిగెనోయి మాధవుడా..

తరుణోపాయం జాతికి..దొరికిందా ఇపుడైనా..!


మందులతో పనేలేని..సంగతొకటి ఉందిచూడు.. 

"శ్వాసమీద ధ్యాస" సరిగ..నిలిచిందా ఇపుడైనా..!

వదిలిందా ఇపుడైనా..! కరోనా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.