Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

381..
ఏ కిరణం సోకగానె తనువు.. పులకరించేనో..! 
ఏ మిత్రుని రాకతో బ్రతుకు..పులకరించేనో..!
గింజ ఎదను పలకరించు ఆత్మీయత చూడాలా..
ఏ భాస్కర తేజంతో..కణము..పులకరించేనో..!
శ్రీ చందన పరిమళాలు..గాలులలో చిలకరించు..
ఏ భానుని భావనతో..మధువు..పులకరించేనో..!
నీలి మబ్బు పల్లవులకు..స్వరములనే కూర్చేందుకు..
ఏ సూర్యుని వేదంతో..చినుకు..పులకరించేనో..!
ఆదిత్యుల మూలమైన..చైతన్యపు లోగిలెచట..?!
ఏ విష్ణుని హాసంతో..జగము..పులకరించేనో..!
దైవదత్త మననేమో..తెలిసేందుకు..'మా(న)ధవు'డా..!
ఏ కృష్ణుని గానంతో..మనసు..పులకరించేనో..!

పులకరించేనో..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.