Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

386..
వాడిపోని స్వప్నాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!
పాల జలధి కవ్వాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!
మధురాపురి దారులలో..పాల కడవ మనసేమో..!
విష్ణుమాయ రాగాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!
పూజ సేయ మెచ్చుకునే దేవుడంటె అహమేలే..!
పెట్టు నూనె దీపాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!
నైవేద్యం స్వీకరించి..దీవించే వారెవరో..?!
మనసు లాగు మోహాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!
కలల అగ్ని పర్వతాలు..పగిలేందుకు విశ్రమించు..!
జన్మ బంధ గంధాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!
పెదవి విప్పి చెప్పనట్టి..'మాధవ'పద సీమ నిలువ..
ప్రేమ మీరా కలహాలకు..వీడుకోలు చెప్పాలోయ్..!

.వీడుకోలు చెప్పాలోయ్..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.