Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

388..
నీ తియ్యని ప్రేమలేఖ..మరువలేను..ఎన్నటికీ..!
అక్షరాల ఆ హాయిని..తెలుపలేను..ఎన్నటికీ..!
కలము తోడ కాగితమున కెంత మధుర అనుబంధం..!?
చెరుపలేని..ఆత్మీయత..పలుకలేను..ఎన్నటికీ..!
పదములలో అందాలను..ఏల పొదిగినావోయీ..!?
అమృత ప్రేమ భావాలను..చూపలేను ఎన్నటికీ..!
నా నుదుటన సింధూరం..ఉదయించే సూరీడా..!
నీ వెచ్చని రెప్పలనే..వీడలేను ఎన్నటికీ..!
స్నేహ గగన జాబిలినా?!..నా వెన్నెల కోరేవా..!?
నీ తలపుల..వేణువునే..కనగలేను..ఎన్నటికీ..!
ఆ 'మాధవ'..సాక్షి నీవు అయినావా..ప్రేమికుడా..!
ఈ వలపుల భారమునే..మోయలేను..ఎన్నటికీ..!

మరువలేను..ఎన్నటికీ..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.