Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

390..
ప్రతి బంగరు ఉదయ సంధ్య..అరుణారుణ మందారం..!
ప్రకృతి మాత అనురాగపు..కరుణారుణ మందారం..!
తెలి మంచు దుప్పటినే..మోహించే..మిత్రునికే..
నీరాజన మర్పించే..నవ్యారుణ మందారం..!
చిగురాకుల తోరణాలు..చిరునగవులు చిందించగ..
పులకింతల వెలిగించే..దివ్యారుణ మందారం..!
కొండగాలి వీనులలో..ప్రణయ భావ వీచికగా..
నిండుతున్నమధువులకే..భవ్యారుణ మందారం..!
వర్ణ వర్ణ చిత్రాలకు..అనువాదం సమకూర్చగ..
పండుతున్న సస్యాలకు..నిత్యారుణ మందారం..!
ఆ'రాధా..మాధవ'పద..బృందావన సీమ లోన..
సుఖజీవన క్రీడాంకిత..సత్యారుణ మందారం..!

అరుణారుణ మందారం..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.