Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

391..
కనులు మూసి శ్వాస ధార..గమనిస్తే..చిత్త శాంతి..!
శ్వాస దారి..గో'దారిగ..గుర్తిస్తే..చిత్త శాంతి..!
గత జన్మల కర్మలన్ని..తొలగించే మూలమదే..!
కాంతి పూల తోట లోన..విహరిస్తే..చిత్త శాంతి..!
బాధలైన..వ్యాధులైన..సమూలముగ వీడేందుకు..
శక్తినంద..శ్రద్ధ కాస్త..చూపిస్తే..చిత్త శాంతి..!
'శ్వాస మీద ధ్యాస' ఉంచ..మొదట మొదట ఇబ్బందే..!
సమయమిచ్చి సహనమింత..వహియిస్తే..చిత్త శాంతి..!
అణువణువున ఉన్న దివ్య జ్ఞాన మందుకొనగ..
మౌనమనే స్నేహ సుమం..ధరియిస్తే..చిత్త శాంతి..!
మానవుడే 'మాధవు'డను సత్యమెరుక కలుగు కొరకు..
అహింసనే ప్రేమ మీర పాటిస్తే.. చిత్త శాంతి..!

చిత్త శాంతి..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.