Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

395..
అంతరంగ శక్తి తెలియ.. ధ్యానమందు మునుగవలెను..!
మాట మాటు శక్తి తెలియ.. మౌనమందు మునుగవలెను..!
అద్భుతమౌ మనిషి జన్మ సార్థకమది అవ్వాలా..!
కనులు మూసి శ్వాస ధార.. జ్ఞానమందు మునుగవలెను..!
సకల జీవ రాశి తోడ మైత్రి చేయ ముచ్చటైన..
సహనముతో..సాక్షి తత్వ.. స్వర్గమందు మునుగవలెను..!
విశ్వ శాంతి సంకల్పము మది నింపుకు పనిచేయగ..
కణ కణమున వెలుగుచున్న.. సత్యమందు మునుగవలెను..!
నేను నీవు లేము విడిగ..ఏకత్వపు కోవెల ఇది..!
అసలు ప్రేమ వనము చూడ..భావమందు మునుగవలెను..!
మానవుడే..'మాధవు'డని..చెప్పేందుకు ఉన్నదెవరు..?!
జన్మ మర్మ మెరిగేందుకు..సమయమందు మునుగవలెను..!

ధ్యానమందు మునుగవలెను..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.