Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

399..
నా కోసం గగనాలే.. దిగి వచ్చిన చెలికాడా..!
నా మువ్వల ఆ తియ్యని..సిరి మెచ్చిన చెలికాడా..!
నీ జతలో ఆడాలను కోరికతో..చూస్తున్నా..!
నా పరువపు సొగసులన్నిమురిపించిన చెలికాడా..!
నీ వెచ్చని తలపు మేడ..నాదేనని తెలిపినావు..!
నా కొరకై గరిక పచ్చ భువి పరచిన చెలికాడా..!
నీ కన్నుల తడి మాటున ఉన్న ప్రేమ తెలిసెనులే..!
నా నీడగ నీ నవ్వులు పండించిన చెలికాడా..!
అక్షరాలు సాక్షులుగా జాలువారు వెన్నెలలో..
నా తోడుగ..నడచు శ్వాస మరపించిన చెలికాడా..!
ఓణీతో దోబూచులు ఆడు గాలి పరువాలకు సోకేలా..!
'మాధవు'డా..! నా ధ్యాసను వెలిగించిన చెలికాడా..!

చెలికాడా..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.