కీర్తి పూర్ణిమ
Kagaznagar,kumuram bheem district, telangana
7569904235

*నేను ఒంటరి ని కాను* 

*********************

భరించాను... భరించాను!!

ముత్తైదువల నోటి తో ఈసడింపులు భరించాను

 

చూసాను చూసాను!!

ఒంటరినని కామం తో 

చూసిన క్రూరమృగాల 

పాడు చూపులు చూసాను!!

 

విన్నాను విన్నాను!!

ఒంటరి దానికి డబ్బులెక్కడివి...?

అని గుసగుస లాడిన చెవులు

కోరికే మాటలు విన్నాను!!

 

సహించాను... సహించానూ!!

నష్ట జాతకురాలినని అసహ్యించుకున్న

 సమాజాన్ని సహించాను!!

 

ఇక!!

 వినేది లేదు... చూసేది లేదు

సహించేది లేదు భరించేదీ లేదు

 

పడుపు వృత్తి కి దిగమన్నారు

కడుపు నిండుద్ధి రమ్మన్నారు

 

చెయ్యి పట్టిన రాక్షసమూకలని  

ముక్కలు ముక్కలు చేసే దాకా ఆగేది లేదు!!

 

ఏమీ సాధించలేనన్నరు

నడిరోడ్డు మిద నెట్టారు 

 

బంగారు పథకాన్ని తెస్తాను

సాధించి నేనేంటో చూపిస్తాను

 

అంతవరకు

 అలిసేది లేదు సొలిసేది లేదు

 

సందిస్తను.... సాధిస్తాను

 నా జీవితం దురదృష్టం కాదని 

కష్ట పడి నిరూపిస్తాను

 

అనుకుంటే 

ఏదయినా సాధించగలనని 

నిలబడతాను... నిరుపిస్తాను

 

*ఒంటరి కాను* 

*నేను ఒంటరి కాను*

*ధైర్యం తోడుంది నాకు*

రేపటి తరాలకు స్ఫూర్తినీ నేను!!

 

ఒంటరి కాను 

నేను ఒంటరి కాను

*విజయం తోడుంది నాకు*

 

*ఒంటరి కాను నేను*

 *ఒంటరి వాళ్లకు స్ఫూర్తిని నేను*

******** **********

సమాజం
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.