Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

404..
అంత లేత అందాలకు.. ఏమివ్వను కానుకగా..!?
ఆ మృదువగు హాసాలకు.. ఏమివ్వను కానుకగా..!?
కలలెరుగని ఆ కన్నుల స్నేహ మధువు కురుస్తోంది..!
వగలెరుగని మురిపాలకు.. ఏమివ్వను కానుకగా..!?
అమాయకపు చిత్రంలా చూస్తున్నది నాకొరకే..!
ఆ కన్నియ రాగాలకు.. ఏమివ్వను కానుకగా..!?
అరుణారుణ మందారపు నిధులున్నవి ఆ సొగసున..!
సిగ్గులొలుకు ఆధారాలకు.. ఏమివ్వను కానుకగా..!?
అభిసారిక వలపు వీణ పలుకుతున్న స్వరములలో..
నినదించే విరహాలకు.. ఏమివ్వను కానుకగా..!?
'మాధవు'డా..! తెలుపుమింక..నా రాధిక చేరు దారి..!
తనదు ప్రేమ స'రసాలకు.. ఏమివ్వను కానుకగా..!?


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ఏమివ్వను కానుకగా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.