Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

405..
చినుకు గుడిని వెలుగుతున్న.. దీపాలను.. చూపు చెలీ..!
మనసు గదిని నలుగుతున్న.. తాపాలను.. తీర్చు చెలీ..!
అనురాగపు వనసీమలు ఉన్నవి నీ కను సన్నల..!
అణువణువును ఏలుతున్న.. హాసాలను..చిందు చెలీ..!
ప్రతి కణమొక అమృత నిధిగ నిలిపినావు విశ్వములో..!
స్వరజతులుగ మారుతున్న..మౌనాలను..కురియు చెలీ..!
మధుర భావ లోకాలను..కావ్యాలుగా మలచేందుకు..
ఎరుక మాటు జరుగుతున్న.. చిత్రాలను..తెలుపు చెలీ..!
దహనమయే కోరికలకు..అద్దమేదొ పట్టేవా..!
రెప్పలలో కరుగుతున్న..స్వప్నాలను..నడుపు చెలీ..!
నా ఊహల కను పాపల ప్రతిఫలించు మందాకిని..!
'మాధవు'డే..చిలుకుతున్న.. హృదయాలను.. మీటు చెలీ..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

చెలీ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.