Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


409..
వెలుగుతోంది అణువణువున..నీలి నీలి ఓంకారం..!
పాడుతోంది మౌనమ్మున..దివ్యశక్తి ఓంకారం..!
అర కన్నుల నిలచి చూడు..అందుతుంది అసలు గుట్టు..!
నింపుతోంది..నీ మనసున..ఓర్మిదీప్తి..ఓంకారం..!
జన్మబంధ కారణాలు మాయచేయు..పని జరుగును..!
నిలుపుతోంది..ఈ జగమున..కోర్కెనంటి..ఓంకారం..!
చిరునవ్వుల పూల వాన కురిపించే..అమృత ధార..!
ఒలుకుతోంది..భావనమున..పెదవి మీటి..ఓంకారం..!
శ్వాస దారి కనుగొనగా పరిమళించు నెచ్చెలియై..!
ఒదుగుతోంది..ఈ తనువున..మధురసాక్షి..ఓంకారం..!
'మాధవు'డా..! నీ రాధను సేద తీర్చు గానమేది..!?
చిందుతోంది..నా తలపున..ప్రేమ వాణి..ఓంకారం..!!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

.దివ్యశక్తి ఓంకారం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.