Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

412..
మనసు చెదిరి ఉంటినోయి - నీకొరకై చూస్తూ'నే..!
నిదుర రాక నిలచితోయి - నీకొరకై చూస్తూ'నే..!
ఈ రేగిన కురుల భాష - గాలికేమి తెలియునటా..?!
ఆవేదన నిలిపితోయి - నీకొరకై చూస్తూ'నే..!
నేను ఎచట ఉన్నానో - ఏమి చేస్తు ఉన్నానో..!?
చేష్టలుడిగి మరచితోయి - నీకొరకై చూస్తూ'నే..!
వలపు బాణమేసి నన్ను- నీ తలపున దాచినావు..!
నాలో నే వేగితోయి - నీకొరకై చూస్తూ'నే..!
ఆ జాబిలి ఈ వెన్నెల - తీర్చలేవు నా తాపం..!
వేగుచుక్క నైతినోయి - నీకొరకై చూస్తూ'నే..!
చెప్పలేను 'మాధవు'నకు - నా బాధను పదములలో..!
ఎడారిలా మిగిలితోయి - నీకొరకై చూస్తూ'నే..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నీకొరకై చూస్తూ'నే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.