Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

419..
నా వెచ్చని కనుపాపల దారులలో సిరిమల్లీ..!
నా మనసును ఊరించే నవ్వులలో సిరిమల్లీ..!
సమ్మోహన రాగానికి సరిగమలను కూర్చేవా..!
కవ్వించే మధురిమలకు స్వరములలో..సిరిమల్లీ..!
నీలి కురుల ఒయారాల సయ్యాటకు నెచ్చెలివా..!
పలకరించు యవ్వనాల మబ్బులలో సిరిమల్లీ..!
నలిగిపోని పరిమళాల ఎదలోయల నెరజాణా..!
మరులు రేపు వర్ణాలకు పెదవులలో సిరిమల్లీ..!
నిను మించిన మోహనాంగి లేరు సుమా మరి ఎవ్వరు..!
విరహ వీణ స్వప్నాలకు తంత్రులలోసిరిమల్లీ..!
'మాధవు'నకు..అంకితమౌ ఆ రాధా ఆరాధవు..!
సాక్షి ధనువు..తనువూ చిందు సొగసులలో సిరిమల్లీ..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

స్వరములలో..సిరిమల్లీ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.