Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

420..
శ్వాసను గురువుగ..చూడక.. పోతివి..!
ఆశల మనసును..వదలక.. పోతివి..!
పూజలు వ్రతములు చక్కని ముసుగులు..!
బ్రతుకొక ఆటగ తెలియక..పోతివి..!
కలయే నిజమను ముచ్చటకేమీ..!
వలసిన మెలకువ పొందక.. పోతివి..!
మోహపు మధువది అద్భుతమేలే..!
కోర్కెల మడుగును వీడక..పోతివి..!
భ్రమలను అల్లుకు పరవశమేలా..?!
గంధపు అడవిని కాల్చక..పోతివి..!
గొడవల గొడుగుల వర్ణాలెందుకు..?!
తియ్యని ప్రేమగా మారక..పోతివి..!
చెలిమికి అద్దం పట్టే చోటున..
పుట్టిన సంగతి పట్టక..పోతివి..!
లక్షల జన్మలు మనిషిగా పుడితివి..!
బానిసతనమును పేల్చక..పోతివి..!
అహమను జలధిని మునకలు సరియే..!
కర్మల చక్రము ఆపక..పోతివి..!
తప్పేం లేదులె..తీర్పులు దేనికి..?!
గొప్పల తిప్పలు తప్పక..పోతివి..!
తనువును వీణగ మలచే పనిలో..
అనువగు సాధన కుదరక..పోతివి..!
ద్వాదశ సూర్యుల అధిపతి 'మాధవ'..!
వెన్నెల వేణువు అందక..పోతివి..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

చూడక.. పోతివి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.