Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

424..
అగ్ని పూల రాశులెన్నొ ప్రతి కణమున..దాగున్నవి..! 
కలల మేఘ వనములెన్నొప్రతి తలపున..దాగున్నవి..!
మౌన నిధిని వర్ణించగ మాటలేల సరిపోవును..!
హాయి నిడగ మెరుపులెన్నొ ప్రతి బ్రతుకున..దాగున్నవి..!
కనులు మూసి ఓ సాక్షిగ ఉండుటలో మునిగి చూడు..!
జన్మకర్మ ముసుగులెన్నొ ప్రతి వలపున దాగున్నవి..!
చిత్రచిత్ర వర్ణాలను దృశ్యాలను కాంచు కనుల భావమేమి..!?
తెలుప రాని వలస మబ్బులెన్నొప్రతి మనసున దాగున్నవి..!
సమయమెంత సావధానమై యుండును..గమనించిన..!
సత్యమేదొ తెలుప పలుకులెన్నొప్రతి క్షణమున దాగున్నవి..!
'మాధవు'నకు అక్షరాల వేణువుతో పనేముంది..?!
బృందావన సీమ సొగసులెన్నొ ప్రతి చినుకున దాగున్నవి..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

తలపున..దాగున్నవి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.