Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

425..
మెరుపు నిధికి మూలమైన చూపుపాట.. నీవే'నా..!?
తలపు పూల నిలయమైన వలపుపాట..నీవే'నా..!?
ఏ మబ్బున దాగి నీవు ఎటునుండి చూసేవో..!?
వింత గొలుపు లోకమైన వెలుగుపాట..నీవే'నా..!?
ప్రేమలోతు తెలిసేనా.. ఆశ గొడవ తీరకున్న..!?
స్వార్థత్యాగ రాగమైన మెతుకుపాట..నీవే'నా..!?
స్నేహానికి పరమార్థం శ్వాస సాక్షి లోనున్నది..!
గుండెలయల నాదమైన బ్రతుకుపాట..నీవే'నా..!?
నిట్టూర్పుల తంత్రులపై నినదించే విరహాలకు..
తిరుగులేని భాష్యమైన చినుకు పాట..నీవే'నా..!?
నీ తియ్యని పెదవులపై వేణువేల కాలేనో..?!
'మాధవు'డా చోద్యమైన మనసు పాట నీవే'నా..?!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వలపుపాట..నీవే'నా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.