Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

426..
ప్రతి తలపొక దీపమౌతు..వెలుగులెన్నొ పంచాలి..!
ప్రతి మనిషొక దైవమౌతు..బ్రతుకులెన్నొ దిద్దాలి..!
మైత్రి సుధలు వర్షించే జాబిలెక్కడుందోయి..?!
ప్రతి మనసొక కమలమౌతు..నవ్వులెన్నో చిందాలి..!
ఏ తనువుకు అంటి ఉంది..కులమన్నది ఎక్కడిది..?!
ప్రతి వృత్తొక స్వర్గమౌతు..ప్రగతులెన్నొ పొందాలి..!
అభిమతములు మధురమైన మతములన్ని చల్లనివే..!
ప్రతి నియతొక మార్గమౌతు..జాతులెన్నొనడవాలి..!
శ్వాస సాక్షి జీవించగ ప్రాణులన్ని ఒకటేగా..!
ప్రతి తలపొక వేదమౌతు చేతులెన్నొకలవాలి..!
మానవుడే 'మాధవు'డై పలికించే రాగాలకు..
ప్రతి క్షణమొక నాదమౌతు..ముదములెన్నొ నింపాలి..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ప్రతి తలపొక దీపమౌతు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.