Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

428..
తియ్యని వెన్నెల వేదం - కురిసే హృదయం నీవే..!
చల్లని చందన గంధం - పంచే స్నేహం నీవే..!
సత్యం తెలియక అవస్థ పడతావెందుకు ఇక లే..!
పువ్వై మిగిలే యోగం - అందే దీపం నీవే..!
బ్రతుకును కర్మగ తలచగ - అవసరమీపై ఉండదు..!
శ్వాసకు చక్కని అద్దం - పట్టే బింబం నీవే..!
సాక్షీ తత్వపు జలధియె - తనువను సంగతి మరువకు..!
అక్షర లక్షల మౌనం - వెలిగే గాత్రం నీవే..!
నడి సంద్రములో ఉన్నది - నా'వని భయపడుచుంటివి..!
జన్మల గొడవల బంధం - కాల్చే జ్ఞానం నీవే..!
మనసే బృందావనిగా - మార్చే 'మాధవు'డేడీ..!?
తరగని వలపుల దుఃఖం - బాపే హాసం నీవే..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

కాల్చే జ్ఞానం నీవే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.