Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

437..
ఆత్మీయ మిత్రులందరికీ.. దీపావళి శుభాకాంక్షలతో..!
సమ్మోహన మధువేదో పిలిచినట్లు అనిపించెను..!
నీ స్వరమే అద్భుతమౌ రాగసిరులు వర్షించెను..!
అర్థాలను వెదికేందుకు నిఘంటువులు దొరకవులే..!
నీ చూపుల ప్రేమవాన విరి జల్లులు పండించెను..!
ఎలా తెలుప నో సఖుడా..నేను మోయు విరహాలను..!?
నీ తలపే బంధనాల జన్మ చెరలు విడిపించెను..!
ఏకాంతపు వెన్నెలనే మీటుచున్న నెలరేడా..!
నీ నవ్వే బృందావన విహారములు జరిపించెను..!
నను వీడని మోహాలను మాయచేసి నావెటులో..?!
నీ పవనమె నవజీవన వేద సుధలు వినిపించెను..!
'మాధవు'డా..! ఈ రాధా అణువణువున మ్రోగేవే..!
నీ గానం నా లోలో పలు దివ్వెలు వెలిగించెను..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నీ చూపుల ప్రేమవాన
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.