Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

438..
అతి త్వరలో అర్థ రహిత - ఈ' చదువులు మారునులే..!
ఉద్యోగపు వేటలన్ని- మానవలసి వచ్చునులే..!
మరణమునే అధిగమించు - విద్య మనకు చేరువాయె..!
సూర్యునితో ముచ్చటింప - వేడుకయే కలుగునులే..!
కలహాలకు స్వస్తి పలుకు - కాలమిదే ఏతెంచెను..!
స్నేహ మధువు పంచి పెట్టు - సంబరమే మిగులునులే..!
తెలివి పెంచు సద్యోగము - 'శ్వాస - ధ్యాస' విశ్వములో..!
ప్రతియొక్కరి కర్మలన్ని సమూలముగ తొలగునులే..!
అణువణువున కోటి కోట్ల - దైవములే కొలువు తీరె..!
ఈ సత్యము బహు చక్కగ - మది మదిలో వెలుగునులే..!
'మాధవు'నకు మానవునకు - వ్యత్యాసము ఉండదింక..
మనసు సాక్షి అయ్యేందుకు - తనువు సహకరించునులే..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ఈ' చదువులు మారునులే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.