Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

439..
ప్రతి వేకువ నింపునుగా - క్రొత్త శక్తి దివ్యముగా..!
ప్రతి వేదన పెంచునుగా - నిత్య శక్తి దివ్యముగా..!
మనసులోకి చూసుకొనుట - కష్టమేమి కాదు సుమా..!
కనులు మూయ అందునుగా - సత్య శక్తి దివ్యముగా..!
మధురమైన కలలన్నీ- నిజమయ్యే దారి ఉంది..!
సహనమున్న దొరకునుగా - నవ్య శక్తి దివ్యముగా..!
ప్రతికణమొక అత్యద్భుత - అమృతవనం గమనిస్తే..
తలచినంత కురియునుగా - భవ్య శక్తి దివ్యముగా..!
ప్రేమకొరకు వెతుకులాట - అసలు సిసలు నవ్వులాట..!
ఆటలాగ ఉండునుగా - విమల శక్తి దివ్యముగా..!
హృదయములో కొలువయ్యిన 'మాధవు'నే అడిగి చూడు..!
శ్వాస లోన చేరునుగా - విజయ శక్తి దివ్యముగా..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

సత్య శక్తి దివ్యముగా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.