Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

442..
నీటిబొట్టు నడిగి చూడు - మెరుపు కథలు చెబుతుంది..!
మట్టికణము మదిని మీటు - రంగు కథలు చెబుతుంది..!
మనసు గుడిని వెలుగుతున్న- దీపాలకు ప్రియ నేస్తం..!
మబ్బుగుండె లయను మునుగు - గురువు కథలు చెబుతుంది..!
జ్ఞాపకాల అల్లరులను - గమనించే పని ఉన్నది..!
అగ్నిశ్వాస దారి నడువు - బ్రతుకు కథలు చెబుతుంది..!
రైతు వేయు అడుగులలో - జారు చెమట గోడేమో..!?
గింజనున్న మొక్క తలపు - మెతుకు కథలు చెబుతుంది..!
ఆట-పాట లేమాయెను - పసి వాళ్లకు ఈ పొద్దున..!?
బడి సంచిని పలకరించు - చదువు కథలు చెబుతుంది..!
ప్రేమ మధువు కరువాయెను - 'మాధవు'డా..! ఈ భువిలో..!
బృందావని రాధ చూపు - వలపు కథలు చెబుతుంది..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

మెరుపు కథలు చెబుతుంది
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.