Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

452..
అక్షరాల మౌన రథం - సిద్ధమాయె నిదుర వీడు..!
మనసు కథల కావ్య వనం - గొప్ప మాయె నిదుర వీడు..!
జన్మ పూల తోటలోని - పరిమళాలు కవ్వించును..!
ప్రేమ పుటల చిత్ర ధనం - లోక మాయె నిదుర వీడు..!
సానుభూతి నాటకాల - వేదికపై జీవితమా..?!
సత్యభామ దరహాసం - స'రస మాయె నిదుర వీడు..!
తప్పు ఒప్పు చెప్పువారు - లేరు నిజం తరచి చూడు..!
ఆల్చిప్పన పడిన జలం - ముత్యమాయె నిదుర వీడు..!
రత్నమెంత..?! గమనిస్తే..ఓ పునాది రాయి ముందు..!
మనాదిలో కర్మబలం - చక్రమాయె నిదుర వీడు..!
'మాధవు'నితొ మాటలాడ - తెలుసుకొనుము ఇకనైనా..!
వాదులాట వలన జయం - వక్రమాయె నిదుర వీడు..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

నిదుర వీడు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.