Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

454..
నీ నవ్వే మంచు పూల - వానమల్లె మారిందా..!
నీ చూపే మెరుపు వాన - పూలమల్లె మారిందా..!
భావనేమొ ఆగిపోయె - మాటలెల్ల మూగవోయె..!
నీ తలపే మధువు మూల - రాగమల్లె మారిందా..!
నా తనువున అణువణువున - నినదించే నాదాలకు..
నీ మువ్వల సవ్వడి శుభ తాళమల్లె మారిందా..!
తెలుపరాని సౌఖ్యాలను - విందుచేయు నీ గానం..!
నా పలుకుల కలరవముల - నేస్తమల్లె మారిందా..!
నే కోరే స్వప్నాలకు - ప్రాణమేల పోసేవో..!?
నా వలపే నవ తారల - సంద్రమల్లె మారిందా..!
గగనాలను దాటించే - నీ అడుగుల జాడలలో..
నా మనసే ప్రణయ సుధల - వర్షమల్లె మారిందా..!
'మాధవు'డా..నీ రాధను - అయ్యేందుకు పుట్టానా..!?
బృందావని నన్నేలగ - స్వర్గమల్లె మారిందా..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

రాగమల్లె మారిందా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.