Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

455..
నాటకాలు చాలులేర - దొంగాటా ఎందుకటా..!?
ఓ తియ్యని ప్రేమవీర - దొంగాటా ఎందుకటా..!?
మధురాపురి మనసేనని - తెలిపినావె తెలుపకనే..!
అమృతస్వర స్పృహ మందిర - దొంగాటా ఎందుకటా..!?
పదములంట పని ఏలా?! - కన్నీరది పెట్టనేల..?!
బృందావన చర సుందర - దొంగాటా ఎందుకటా..!?
భవబంధము లెల్ల తొలగ - నీ తలపే వరమౌనే..!
నవ మోహన వంశీధర - దొంగాటా ఎందుకటా..!?
నెచ్చెలులను అలరించే - నెయ్యమునకు సాక్షి నీవు..!
శుభకర నవనీత చోర - దొంగాటా ఎందుకటా..!?
'మాధవుడా'..! కనలెమ్మిక - నీ బాధను కానలేను..!
వెన్నెలంటి చెలిమీశ్వర - దొంగాటా ఎందుకటా..!?


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

దొంగాటా ఎందుకటా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.