Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


457..
ఊపిరిలో ఊపిరికే - వగంధం - బంధించెను యుగాలుగా..!
స్నేహవీచి రాగాలకు - మెరుగుపూస నీ తలపు..!
విరహమెంత, ఏకాంతపు వనసీమన చేరినంత..!
సొంతగూటి వాసనలకు - విరుగుపూస నీ తలపు..!
మరగిపోవు వలపులతో - కలహాలకు దిగనేలా..?!
దరహాసపు వెన్నెలలకు - మంచుపూస నీ తలపు..!
పరుగుతీయు పవనాలను - నిలపాలను కోరికేమి..?!
ఋతుశోభల పరువాలకు - మరుగుపూస నీ తలపు..!
చినుకువేణు రవములలో - క్రీడించే ''మాధవుడా''..!
మేలుకొల్పు వేకువలకు - చిగురుపూస నీ తలపు..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నీ తలపు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.