Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

463..
నీవు లేక నా స్వప్నం - మధురకావ్య మవ్వదుగా..!
నువు చూడక నా భావం - నిత్యపున్నమవ్వదుగా..!
సాగరాన ప్రతి కెరటం - నీ వెలుగే చిమ్ముతోంది..! 
నువు మీటక నా మౌనం - అమృతవర్ష మవ్వదుగా..!
ఎదుట నున్న ప్రతి కణమూ - నీ వలెనే తోచేనే..!
నువు చిలుకక నా రాగం - దివ్యదీప మవ్వదుగా..!
అక్షరాన్ని శాసించే - శ్వాసమాటు చెలికాడా..!
నువు పిలువక నా హృదయం - బృందావన మవ్వదుగా..!
చెలిమితోట ఎక్కడుంది - నీ నవ్వున గాక ప్రియా..!?
నిను తలవక నా సమరం - సరసగాన మవ్వదుగా..!
'మాధవు'డా..! మధురాపురి - బహు సుందర నగరం కద..!
నిను కూడక నా పాదం - నాట్యమేఘ మవ్వదుగా..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

మధురకావ్య మవ్వదుగా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.