Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

465..
మనసును దోచిన చందన పరిమళ స్నేహం నీదే..!
మనిషిని చేసిన సుందర సుఖప్రద స్నేహం నీదే..!
ఎన్నో జన్మల భాగ్యం ఎంతో హాయిగ పండెను నేటికి..!
బ్రతుకును ఇచ్చిన వసంత సౌరభ స్నేహం నీదే..!
ఆశల దీపము శ్వాసన వెచ్చగ కానుక చేస్తివి..!
తోడుగ నిలచిన సుమధుర మంగళ స్నేహం నీదే..!
వాడని కాంతుల వేదికపై నను నడిపించేవా..!
నీడగ మారిన వెలుగుల వెన్నెల స్నేహం నీదే..!
తెలియని వెన్నో తియ్యగ తెలిపే మౌనపు నిధివా..!
స'రసము విరిసిన మధువుల కోవెల స్నేహం నీదే..!
బృందావనమున మాయకు సాక్షివి నీవే 'మాధవ'..!
బంధము నిలిపిన శుభకర స్వరముల స్నేహం నీదే..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

స్నేహం నీదే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.