Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

474
కాల్చలేని శూన్యవీణ ~ శృతి చేయర ప్రియ సఖుడా..!
పాడరాని రాగాలను ~ ఎద నింపర ప్రియ సఖుడా..!
శిల్పమేదొ..తల్పమేదొ ~ తెలియలేని నీ చెలినే..!
కాల్పనికత తెరలన్నీ ~ మసి చేయర ప్రియ సఖుడా..!
మనసు కథల పట్టుపుట్ట ~ వింత చెరను నే వీడగ.. 
ప్రేమవిందు గగనాలకు ~ నడిపించర ప్రియ సఖుడా..!
అరకన్నుల చూడలేని ~ తనమంతా అర్పణమే..!
నీ పదముల చేరు గుట్టు ~ అందించర ప్రియ సఖుడా..!
నిజవేణువు నాదాలను ~ ఆలకించు విధమేదో..?!
చిరునవ్వుల చెలిమి పట్టు ~ వివరించర ప్రియ సఖుడా..!
నీ గోపిక ఊపిరిలో ~ ఓపికెంతొ దాచినావు..!
'మాధవుడా'..! నీ రాధను ~ లాలించర ప్రియ సఖుడా..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

శృతి చేయర ప్రియ సఖుడా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.