Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


477...
వెలుగుతున్న దివ్వెలెన్నొ ~ ఒక్క చినుకు కోవెలలో..!!
చితుకుతున్న రవ్వలెన్నొ ~ ఒక్క బ్రతుకు కోవెలలో..!!
జన్మచిత్ర పటములెల్ల ~ కులుకుతున్నవెందులకో..?! 
రగులుతున్న వలపులెన్నొ ~ ఒక్క తనువు కోవెలలో..!!
దృశ్యకావ్యమేలు కనుల ~ నిండుతున్న సంపదేమొ..?!
దూకుతున్న యేరులెన్నో ~ ఒక్క చూపు కోవెలలో..!!
మౌనాలకు సాక్షియౌచు ~ మరుగుతున్న భావనలో..
మ్రోగుతున్న మువ్వలెన్నొ ~ ఒక్క పలుకు కోవెలలో..!!
స్వచ్ఛమైన ప్రేమ విలువ ~ చాటుతున్న శాంతి సీమ..
నవ్వుతున్న పువ్వులెన్నొ ~ ఒక్క మెతుకు కోవెలలో..!!
మైత్రివనములోన నిలచి ~ వెలుగుతున్న 'మాధవు'డా..!
పండుతున్న తలపులెన్నొ ~ ఒక్క మనసు కోవెలలో..!!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఒక్క చినుకు కోవెలలో
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.