Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

481..
వింత వాన మధువేదో కురుస్తోంది..నీ చూపున..!
ప్రకృతి కాంత సొగసంతా తడుస్తోంది..నీ చూపున..!
వెలుగుతున్న మెరుపుపూల తోటంటే నీ మౌనం..!
మాయ మనసు తన ముసుగును విడుస్తోంది..నీ చూపున..!
స్వప్నాలను పండించే యజ్ఞకర్త నీవేగా..!
వశముకాని పరవశమే మురుస్తోంది..నీ చూపున..!
కథలు అల్లు పెదవులెల్ల మూగవోయె నెరజాణా..!
వ్యథలు పొంగు వేదనయే నిలుస్తోంది..నీ చూపున..!
అరవిరిసిన ఇంద్రధనువు పలకరింపు మధురిమయే..
సడిసేయని సెలయేరై విరుస్తోంది..నీ చూపున..!
నీ స్మరణకు ఈ రాధను దూరమెవరు చేయలేరు..!
ఓ 'మాధవ' నా సర్వం ముగుస్తోంది..నీ చూపున..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నీ చూపున
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.