Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

484..
చిరుగాలికి పాట నేర్పు సన్నాయివి నీవేలే..!
మరుమల్లెకు నవ్వనేర్పు ప్రియురాలివి నీవేలే..!
ప్రణయ మధువులూరించే నవవసంత సరసాంగీ..!
పసిడి మెరుపు విరి మొగ్గల రసరాజ్ఞివి నీవేలే..!
విరహాగ్నులు చల్లార్చే మేఘాలకు సారథివే..!
చెలిమి సరసు హాసాలకు అసలు నిధివి నీవేలే..!
ఎలకోయిల రాగాలకు స్వరములొసగు మహరాజా..!
పున్నమలకు వెలుగుసుధల మధుర సిరివి నీవేలే..!
భ్రమల కొలువు కూటంలో సరసాలకు ప్రాణమేమి..!?
శ్వాసదారి గగనమెత్తు కాంతిగిరివి నీవేలే..!
సాక్షి జలధి దాటేందుకు సాయమౌను 'మాధవు'డే..!
ఆలోచన వధువవగా..మౌనఝరివి నీవేలే..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ప్రియురాలివి నీవేలే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.