Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

488..
గులాబీని ఇష్టపడే మనసుంటే మంచిదిలే..!
ముల్లునైన ప్రేమించే మనసుంటే మంచిదిలే..!
ఆ చుక్కల తోటలోన విహరించే ప్రియ సఖుడా..!
కష్టాలను ఎదుర్కొనే మనసుంటే మంచిదిలే..!
సెలయేరుల సవ్వడులను ఆలకించు ప్రేమికుడా..!
వేదనలను ఓదార్చే మనసుంటే మంచిదిలే..!
యాంత్రికతకు స్పందించే గుణమేలా సుఖమునిచ్చు..?!
స్నేహాలను వెలిగించే మనసుంటే మంచిదిలే..!
మట్టి కణం దాహమెంత అద్భుతమో చూడవోయి..!
పరిమళమై ప్రవహించే మనసుంటే మంచిదిలే..!
పాఠమైన ప్రేమగీతి 'మాధవు'డే పాడాలా..!
తీరంలా పులకించే మనసుంటే మంచిదిలే..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

మనసుంటే మంచిదిలే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.