Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

489..
పడి లేచే కెరటానికి ~ పాఠమెవరు చెప్పాలట..!?
ఉదయించే కిరణానికి ~ ఊతమెవరు ఇవ్వాలట..!?
మదిమదిలో ఉప్పొంగే ~ భావాలకు నిఘంటువా..!
అగ్నివీణ నాదానికి ~ బీజమెవరు చూపాలట..?!
ప్రతి కణమున ఒలుకుతున్న~ ప్రేమసుధకు రూపమేమి..?!
ప్రకృతిమౌన వేదానికి ~ భాష్యమెవరు వ్రాయాలట..?!
నువ్వెవరో..నేనెవరో ~ పాటల నది శిల్పాలము..!
ఇంద్రధనువు పరువానికి అద్దమెవరు పట్టాలాట..?!
శృతిపక్వపు శ్వాసగతిని ~ గమనిస్తే అర్థమగును..!
ప్రకాశించు తత్వానికి ~ ప్రమిదనెవరు పెట్టాలట..!?
సాక్షియైన హృదయంలో ~ కలలరథం మాయమౌను..!
ఆ 'మాధవ' ప్రణయానికి ~ ఆజ్యమెవరు పోయాలట..?!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

పాఠమెవరు చెప్పాలట
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.