Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

490..
చినుకు మనసు తడిమి చూడు..చిత్రాలను చూపుతుంది..!
బిందుబిందువు లోన సింధువు..ద్వారాలను సాకుతుంది..!
చిగురుటాకు అరుణిమలను లాలించే భావనేదొ ..!
నవ వసంత రాగ సుధకు..మోహాలను అల్లుతుంది..!
రైతుగుండె చెరువుకాగ ఓపలేని తల్లి తాను..!
మబ్బులోన అసలు మెరుపు.. దీపాలను మీటుతుంది..!
మైత్రీప్రియ సుందరుడౌ భాస్కరునకు చెలి తానై..!
ఇంద్రధనువు మనోగతపు..కావ్యాలను చిలుకుతుంది..!
నిత్య నూత్న శక్తినిడగ తోడిరాగ మాలపిస్తు..
అంతరంగ జగతి నేలు..దాహాలను బాపుతుంది..!
అమృతమేఘ రంజనియై ఎదఎదలో జాలువార..
ఆ 'మాధవ' వేణు నిధుల..పవనాలను పంచుతుంది..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

చిత్రాలను చూపుతుంది
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.