Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

494..
కొమ్మలలో ఎలకోయిల ~ పాడుతోంది మనకోసం..!
మబ్బులలో మెరుపుతీవ ~ ఆడుతోంది మనకోసం..!
తళుకులీను విరహాలిక ~ వీగిపోవు వేళాయెను..!
కొండ దూకు జలకన్నియ ~ నవ్వుతోంది మనకోసం..!
కలలుగనే స్వప్నాలకు ~ మేలుకునే తీరికేది..?!
మౌనరాణి సాక్షి చిలుక ~ పలుకుతోంది మనకోసం..!
కలహంసలు..చకోరములు ~ ముచ్చటించు తీరేమో..?!
పాలపుంతలాగ ఎదుట ~ వెలుగుతోంది మనకోసం..!
మొగలిపొదల పరిమళాలు ~ లేఖలుగా మదిచేరగ..
సుమరజమే పానుపవగ ~ రాలుతోంది మనకోసం..!
'మాధవు'నకు హారతిగా ~ మారేదే మనసు కదా..!
ప్రతి క్షణమొక దీపశిఖగ ~ మిగులుతోంది మనకోసం..!

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

పాడుతోంది మనకోసం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.