Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

497 ..
దిగులేలా సౌఖ్యముగా విడలేవా పరదానే..!?
మది గులాబి చిహ్నముగా విడలేవా పరదానే..!?
ఎడారిలో ఖజూరమై ఊరించే ప్రేయసివే..!
విరహానికి అద్ధముగా విడలేవా పరదానే..!?
ఎద నిండిన ప్రణయానికి చిరునామా నీ వలపే..!
గాయానికి లేపముగా విడలేవా పరదానే..!?
గుబులు రేపు జ్ఞాపకాల శిధిలాలయ వీధులలో..
పలకరించు మేఘముగా విడలేవా పరదానే..!?
రాయి కన్న రాయి గాకు..పరాయిగా నను తలచకు..!
అమృతప్రేమ సాక్ష్యముగా విడలేవా పరదానే..!?
ఆ ''మాధవ'' ఇష్టసఖిగ నీవైతే..ఆనందం..!
జగములేలు లాస్యముగా విడలేవా పరదానే..!?

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

విడలేవా పరదానే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.