Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

499..
కుంచెలకందని పరదాలున్నవి చూపడ మెట్లా..!?
కన్నులకందని దుఃఖాలున్నవి చూపడ మెట్లా..!?
ప్రేమకు లొంగని మనసులు ఎన్నో ఓ ప్రియ నేస్తం..!
పలుకులకందని రాగాలున్నవి చూపడ మెట్లా..!?
మోహం చేసే సందడి ఎంతో ఎవరికీ తెలియును..?!
తలపులకందని దాహాలున్నవి చూపడ మెట్లా..!?
కలతలు రేపే చీకటులన్నీ గాలికి రాలేనా..?!
శ్వాసలకందని మౌనాలున్నవి చూపడ మెట్లా..!?
తియ్యని కలలను పంచే చెలిమికి రూపం ఉందా..?!
వెన్నెలకందని హాసాలున్నవి చూపడ మెట్లా..!?
''మాధవ'' రాధాగ మారిన అందును సౌఖ్యం..!
రంగులకందని చిత్రాలున్నవి చూపడ మెట్లా..!?


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

చూపడ మెట్లా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.