Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

502..
కలను కూడ క్షణమైనా ఈ చెలిమికి సెలవివ్వకు..!
చెరిగిపోని చిరునవ్వుల ఈ కలిమికి సెలవివ్వకు..!
నీ కన్నులు వర్షించే రాగాలకు వర్ణనలా..!?
మోయలేని మధురమైన ఆ హాయికి సెలవివ్వకు..!
ఏ నటనలు చేతకాని వలపుసిరుల నెలరాజా..!
పదములలో ఒదిగిపోని గుండె తడికి సెలవివ్వకు..!
నవమోహన నాట్యసుధల వనసీమన నిలచేవా..!
అంతులేని దివ్యప్రేమ శ్రుతుల సడికి సెలవివ్వకు..!
చైతన్యపు దీపాలకు చిరునామా నీ హృదయం..!
తొందర పడి గురువయ్యిన ఈ బడికి సెలవివ్వకు..!
ఉదయసంధ్య వెలుగుమల్లె నవ్వే ఓ 'మాధవు'డా..!
సాక్షియైన పరమాద్భుత శ్వాసగుడికి సెలవివ్వకు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఈ చెలిమికి సెలవివ్వకు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.