Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

505..
కనుల నీరు రానివ్వకు.. మా ప్రియతమ రైతన్నా..!
నేలతల్లి ఒడి మరువకు..మా ప్రియతమ రైతన్నా..!
వెన్నకన్న మెత్తనైన.. మనసు నీది బాధపడకు..!
విశ్వాసం విడనాడకు.. మా ప్రియతమ రైతన్నా..!
మా ఆశలు రుచులు తీర్చు.. ఆశయమే నీది కదా..!
నిరాశకిక చోటివ్వకు..మా ప్రియతమ రైతన్నా..!
మట్టి గుండె మీటుతున్న మహరాజువు నీవోయీ..!
మరి ఎవరికి గులామవకు..మా ప్రియతమ రైతన్నా..!
గోశాలలు వృద్ధి చేసి.. పాడి పంట కాపాడగ..
క్షణమైనా వెనుకాడకు..మా ప్రియతమ రైతన్నా..!
ఆ 'రాధా మాధవు'లే..నిత్యమింక నీకు తోడు..!
లోటుండదు పండుగలకు..మా ప్రియతమ రైతన్నా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

మా ప్రియతమ రైతన్నా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.