Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

514..
ఎన్ని సార్లు పుట్టినామొ..ప్రేమ విరుల తోటలోన..!?
కలసి ఏల మరచినామొ..స్నేహ సిరుల తోటలోన..!?
కలహంసల ప్రణయసీమ..మానసమని గుర్తించక..
కలహమేల సలిపినామొ..కలల మరుల తోటలోన..!?
సొంతమేది లేదన్నది..తెలిసి తెలిసి పంతాలా..!?
ఏ కర్మల సోలినామొ..భ్రమల గిరుల తోటలోన..!?
పసిడికాంతి తలపుచేను..పండించే ముచ్చటలో..
పోరులెన్ని చేసినామొ..రాగఝరుల తోటలోన..!?
హాస్యాస్పద సప్తపదుల..అష్టపదుల క్రీడలలో..
ఎంత మునిగి తేలినామొ..భోగపరుల తోటలోన..!?
వైభోగపు భువనాలకు..నడిపించే 'మాధవుడా..!'
వింతలెన్ని గాంచినామొ..శ్వాస తరుల తోటలోన..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ప్రేమ విరుల తోటలోన
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.