Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

516..
మంచుతెరల మేలిముసుగు..జవరాలికి స్వాగతం..!
తేనెఊట సొగసులొలుకు ..నవసరసికి స్వాగతం..!
తెల్లవార్లు ఒంటరిగా కలలతోట పరవశించు..
మురిసిపోవు కనుల మాటు..మధుపాయికి స్వాగతం..!
విరహాలకు వీడుకోలు పలుకుచెలియ నీవె కావ..!
పాలపుంత మురిపాలను..పంచు చెలికి స్వాగతం..!
గోర్వెచ్చని శ్వాసలతను లాలించే కోమలిరో ..!
పసిడికాంతి దారి చూపు..వనరాణికి స్వాగతం..!
మధుపాత్రగ తనువునొసగి.. ప్రాణజ్యోతి నడిపేవా..!
కలలవీణ ఎదను మీటు..ప్రియసాక్షికి స్వాగతం..!
చైత్రరాగ వర్ణాలను వర్షించే మేఘమాల నీవేలే..!
చైతన్యపు ప్రభలు కురియు..మూలనిధికి స్వాగతం..!
విశ్వమైత్రి చంద్రికలను విందుచేయు 'మాధవు'నకు..
వేణుగాన మాధురులను..నింపు సఖికి స్వాగతం..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

స్వాగతం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.